
బాలీవుడ్ స్టార్‌హీరో అమీర్ ఖాన్‌కు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పేరుంది. ఏ పాత్ర టేకప్ చేసినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తనవైపు నుండి 100% ఎఫర్ట్స్ పెడతారాయన. అందుకే అమీర్‌ఖాన్ ఏ ప్రాజెక్టును సైన్ చేసినా అది వెంటనే క్రేజీగా మారిపోతుది. ఆయన లుక్స్, గెటప్స్ విషయాల్లో చేసే ప్రయోగాలకు అసలు లెక్కే ఉండదు. తాజాగా అమీర్ ఒక కొత్త లుక్‌లో అందరినీ షాక్‌కు గురిచేశారు. తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో పోస్ట్‌చేశారు.ఆ వీడియోలో సాధారణంగా ఉన్న అమీర్‌ను మేకప్ సాయంతో ఒక వయసు పైబడిన వ్యక్తిగా మార్చటం ఉంది.సగం బట్టతల, మిగతా సగం తెల్లటి జుట్టు, మీసాలతో అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అమీర్. ఈ వీడియోకు ‘కమింగ్ సూన్.. ఆప్‌కే ఫోన్ పే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఓ యాప్‌కు అమీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా డీల్ కుదుర్చుకున్నారు. ఈ బ్రాండ్ యాడ్ షూటింగ్ కోసం ఇలా గెటప్ మార్చారు.