V6 News

ఎన్‌ఆర్‌ఐ MBBS విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై నాలుగున్నర ఏళ్లకే ఫీజు

ఎన్‌ఆర్‌ఐ  MBBS విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై నాలుగున్నర ఏళ్లకే  ఫీజు

 స్విమ్స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను ఐదు సంవత్సరాలకు కాకుండా నాలుగున్నర సంవత్సరాలకే వసూలు చేయాలని టీటీడీ నిర్ణయించింది .

2021-22 బ్యాచ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇటీవల టిటిడి ఈవోను కలిసి తమ కోర్సు వ్యవధి  నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే కావడంతో అదే మేరకు ఫీజులు వసూలు చేయాలని టిటిడి ఈవో ఎం.రవిచంద్రకు విజ్ఞప్తి చేశారు. స్విమ్స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను 5 సంవత్సరాలకు వసూలు చేస్తున్నట్లు వారు వినతి పత్రం సమర్పించారు.

ఈ అంశాన్ని పరిశీలించిన టిటిడి ఈవో, నేషనల్ మెడికల్ కమిషన్ 07-04-2026న జారీ చేసిన నిబంధనలను పరిశీలించి, ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ కోర్సుకు ఫీజులు నాలుగున్నర సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో చర్చించి, తగిన ఆమోదం (రాటిఫికేషన్) పొందేందుకు చర్యలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం 2021-22బ్యాచ్ విద్యార్థులు చివరి సంవత్సరంలో ఉండటంతో, వారికి 5 సంవత్సరాలకంటే  నాలుగున్నర సంవత్సరాలకే ఫీజులు వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇదే విధానం ఇకపై వచ్చే తదుపరి బ్యాచ్‌లకు కూడా అమలు కానుంది.