V6 News

SRH vs CSK మధ్య బిగ్ ఫైట్.. ఈ పోరులో ఎంఎస్ ధోనీ ఆడతాడా?

SRH vs CSK మధ్య బిగ్ ఫైట్.. ఈ పోరులో ఎంఎస్ ధోనీ ఆడతాడా?

SRH vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ఫుల్ జోష్‌లో కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఇప్పుడు పోరాటాల గడ్డపై తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈరోజు (2026, ఏప్రిల్ 18) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ (ఉప్పల్) ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో తలపడనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రుతురాజ్ వర్సెస్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ వార్ ట్రెండ్ అవుతోంది. అలాగే సీఎస్‌కే తరపున సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడం హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా రెండు హోమ్ మ్యాచ్‌లు గెలిచిన జోరులో ఉన్న చెన్నైని, తమ సొంత గడ్డపై హైదరాబాద్ అడ్డుకుంటుందో లేదో చూడాలి!


హెడ్-టు-హెడ్ రికార్డ్స్: 
సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఇప్పటి వరకు 22 మ్యాచులు జరిగాయి. ఇందులో సీఎస్కే 15 సార్లు విజయం సాధించగా, హైదరాబాద్ కేవలం 7 సార్లు మాత్రమే గెలిచింది. ఇక హైదరాబాద్‌పై చెన్నైకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2013లో ఇదే వేదికపై CSK 223 పరుగుల భారీ స్కోరు సాధించగా, 2018 ఫైనల్‌లో షేన్ వాట్సన్ వీరోచిత సెంచరీ (117*) ఫ్యాన్స్‌కు ఇప్పటికీ కళ్ళముందే కదలాడుతోంది.

 కెప్టెన్లుగా కొత్త వారు: 
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు షాకింగ్ న్యూస్ ఏమిటంటే, చెన్నై జట్టుతో కలిసి హైదరాబాద్ చేరుకున్నప్పటికీ, ఫిట్‌నెస్ కారణాల వల్ల మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక SRH రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయినప్పటికీ, ఇంకా ఈరోజు జరిగే మ్యాచ్ కి అందుబాటులోకి రాలేదు. దీంతో ఇషాన్ కిషన్ ఆరెంజ్ ఆర్మీని నడిపించనున్నాడు.

తుది జట్ల అంచనా:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్ & కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఈషన్ మలింగ.
ఇంపాక్ట్ ప్లేయర్స్: లియామ్ లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్

చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: మాథ్యూ షార్ట్, మాట్ హెన్రీ