భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా 172 రైళ్ల రద్దు

భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా 172 రైళ్ల రద్దు

ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావం రైళ్ల రాకపోకలపై కూడా పడింది. రైలు మార్గాలు దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ప్రకటించింది. గుంతకల్లు, విజయవాడ డివిజన్లలో కురుస్తున్న భారీ వర్షాలతో రైళ్లు ఆగిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19, 20, 21, 22, 23, 24 తేదీల్లో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరి తెలుగురాష్ట్రాల మీదుగా ప్రయాణించే 172 రైళ్లను రద్దుచేశారు. అంతేకాకుండా.. మరో 29 రైళ్లను పాక్షికంగా రద్దు చేసి.. 108 రైళ్లను దారి మళ్లించారు. వీటిలో అయిదు రైళ్ల ప్రయాణ సమయాలను మార్చగా.. రెండు రైళ్ల గమ్యస్థానాలను కుదించారు. గుంతకల్లు డివిజన్‌లో నందలూరు టు రాజంపేట, రేణిగుంట ట పుడి, ధర్మవరం టు పాకాల సెక్షన్‌, విజయవాడ డివిజన్‌లో నెల్లూరు టూ పడుగుపాడు సెక్షన్లలో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. పలుచోట్ల రైల్వేట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దాంతో రైళ్లు రద్దవ్వడం, కొన్నిచోట్ల గమ్యస్థానం కుదించడంతో ప్రయాణికులు రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొందరు సమాచారం అందక రైల్వేస్టేషన్లకు వచ్చారు.

ఈ నెల 21న బయల్దేరాల్సిన పలు రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. వాటిలో గుంతకల్లు టు రేణిగుంట టు గుంతకల్లు, గుంతకల్లు టు తిరుపతి, విజయవాడ టు చెన్నై సెంట్రల్‌, కరీంనగర్ టు తిరుపతి, నిజామాబాద్ టు తిరుపతి, తిరుపతి టు ఆదిలాబాద్ టు తిరుపతి, కాచిగూడ టు వాస్కోడగామా, విజయవాడ టు గూడురు, గూడూరు టు రేణిగుంట టు గూడూరు, కాచిగూడ టు చెంగల్పట్టు, కాచిగూడ టు చిత్తూరు టు కాచిగూడ, సికింద్రాబాద్ టు తిరువనంతపురం, గూడురు టు సికింద్రాబాద్‌, లింగంపల్లి టు తిరుపతి టు లింగంపల్లి, హైదరాబాద్ టు చెన్నైసెంట్రల్‌ టు హైదరాబాద్‌ తదితర రైళ్లున్నాయి. ఈ నెల 22న రద్దైన రైళ్లలో కాచిగూడ టు తిరుపతి టు కాచిగూడ, తిరుపతి టు హజ్రత్‌నిజాముద్దీన్‌, నిజామాబాద్ టు తిరుపతి టు నిజామాబాద్‌, కాచిగూడ టు చెంగల్పట్టు టు కాచిగూడ, ఈ నెల 23 బయలుదేరాల్సిన వాస్కోడగామా టు కాచిగూడ, బెంగళూరు టు హతియా, హజ్రత్‌నిజాముద్దీన్‌ టు మధురై, హజ్రత్‌నిజాముద్దీన్ టు ఎర్నాకుళం, చెన్నైసెంట్రల్‌ టు న్యూఢిల్లీ టు చెన్నైసెంట్రల్‌, న్యూఢిల్లీ టు త్రివేండ్రం, చెన్నైటు హజ్రత్‌నిజాముద్దీన్‌ టు చెన్నై, చెన్నైసెంట్రల్ టు హజ్రత్‌నిజాముద్దీన్‌ టు చెన్నైసెంట్రల్‌, పాట్నాటు ఎర్నాకుళం, అహ్మదాబాద్ టు చెన్నైసెంట్రల్‌ రైళ్లు రద్దయ్యాయి. అదేవిధంగా ఈ నెల 24న బయలుదేరాల్సిన తిరుపతి టు హజ్రత్‌నిజాముద్దీన్‌ రైళు కూడా రద్దయింది.