హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని విద్యార్థి, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా వచ్చే నెల 1న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ జీవన్ తెలిపారు.
‘దగా పడ్డ తెలంగాణ విద్యార్థి, మార్పు కోసం మహా ఉద్యమం’ పేరుతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ సభ నిర్వహిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
