వంట గదిలో తల్లి.. బాల్కనీలో ఆడుకుంటున్న పాప.. సడన్గా దడేల్మని శబ్దం.. ఏంటా అని వచ్చి చూసేసరికి..

వంట గదిలో తల్లి.. బాల్కనీలో ఆడుకుంటున్న పాప.. సడన్గా దడేల్మని శబ్దం.. ఏంటా అని వచ్చి చూసేసరికి..

పిల్లలను ఒక వయసు వచ్చేదాకా మనం ఏ పనిలో ఉన్నా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఆదమరిస్తే.. క్షణం చాలు పిల్లలు తెలిసీతెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. బెంగళూరులో అదే జరిగింది. ఈ వీడియోలో కనిపించిన దృశ్యం చూసి నెటిజన్లు ఉలిక్కిపడ్డారు. 18 నెలల చిన్నారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేరుగా కింద పడింది. బెంగళూరులోని నయనదహళ్లి ప్రాంతంలో ఈ విషాద ఘటన జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం ఈ ఘటన జరిగింది.

ఏడాదిన్నర వయసున్న చిన్నారి తన ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందపడి గాయపడింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో విషయం బయటికొచ్చింది. క్షణాల్లోనే అంతా జరిగింది. తల్లి వంట గదిలో ఉండగా పాప ఆడుకుంటూ ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ వైపు ఉన్న గ్రిల్స్ వైపు వచ్చి ఆడుకుంటూ ఉంది. అయితే.. గ్రిల్స్ బాల్కనీ మొత్తం లేకపోవడంతో ఆ పాప ఆడుకుంటూ బ్యాలెన్స్ కోల్పోయి బాల్కనీ నుంచి రోడ్డు మీదకి పడిపోయింది. అంత ఎత్తు నుంచి పడటంతో చిన్నారి తలకు తీవ్ర గాయమైంది.

Also Read : మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

ఉలుకూపలుకూ లేకుండా పడి ఉన్న చిన్నారిని స్థానికులు గమనించి ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చారు. చిన్నారి తల్లి ఏడ్చుకుంటూ వచ్చి చూడగా కూతురు తలకు తీవ్ర గాయమై రక్తం కారిపోతూ ఉంది. ఆ షాక్లో పాప తల్లి స్పృహ కోల్పోయింది. తల్లీ, కూతురిని.. ఇద్దరినీ హుటాహుటిన పాపను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. పాపకు ఐసీయూలో చికిత్స అందించారు. తలకు గాయమైనప్పటికీ అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పిందని.. పాప కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ ఘటనకు ఎవరినీ బాధ్యులుగా భావించడం లేదని ఆ చిన్నారి తండ్రి పోలీసులకు తెలిపారు.