కరీంనగర్ కమిషనరేట్‌లో జీతాల స్కామ్.. చనిపోయిన పోలీసుల పేర్లతో మూడేళ్లుగా ఎంత నొక్కేశారో !

 కరీంనగర్ కమిషనరేట్‌లో జీతాల స్కామ్.. చనిపోయిన పోలీసుల పేర్లతో మూడేళ్లుగా ఎంత నొక్కేశారో !

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జీతాల స్కామ్ కలకలం రేపింది. చనిపోయిన పోలీసుల పేర్లపైన కోట్లలో జీతాలు విత్ డ్రా చేసిన వైనం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఈ స్కామ్ గురించి సీక్రెట్ గా దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారులు.. గురువారం (2026 ఏప్రిల్ 09) వివరాలు బయటపెట్టారు.

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో రూ. 1.40 కోట్ల జీతాల స్కామ్ జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. పే సెక్షన్ ఉద్యోగి ఒకరు మరణించిన పోలీసుల పేర్లతో మూడేళ్లుగా జీతాలు డ్రా చేస్తున్నట్లు తేల్చారు. ముగ్గురు చనిపోయిన కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలతో భారీ మోసానికి పాల్పాడ్డడు. IFMIS పోర్టల్‌లో డేటా మార్చి నిధులను కాజేసినట్లు గుర్తించారు. 

ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి వ్యక్తిగత మొబైల్ నంబర్ల అనుసంధానం చేసి శాలరీ విత్ డ్రా చేయడం ప్రారంభించాడు. 2022 నుండి 2026 వరకు ప్రభుత్వ ధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించాడు. అక్రమంగా వచ్చిన సొమ్ముపై పర్సనల్ లోన్లు పొంది జల్సాలు చేసినట్లు గుర్తించారు.

నిందితుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో- ఆరా తీస్తున్న సీపీ గౌష్ ఆలం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. దీనిపై మరింత లోతైన దర్యాప్తు చేసి ఎవరెవరు ఉన్నారో బయటపెడతామని చెప్పారు.