సైబర్ స్కామ్, డిజిటల్ అరెస్టు లాంటి కొత్త రకం మోసాలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. అమాయకులను చాలా సింపుల్ గా బోల్తా కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగులనే బురిడీ కొట్టిస్తున్న దుండగులు.. సామాన్యులను చాలా ఈజీగా నమ్మించి వేలల్లో, లక్షల్లో లాగేస్తున్నారు. కొమురం భీం జిల్లాలో సైబర్ నేరగాళ్ల మోసానికి చికెన్ వ్యాపారి బలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. కొమురం భీం జిల్లా బెజ్జుర్ లో సైబర్ మోసం బయటపడింది. చికెన్ వ్యాపారి నుంచి విడతల వారీగా 50 వేల రూపాయలు నొక్కేశారు సైబర్ నేరగాళ్లు. ఏకంగా బెజ్జుర్ ఏఎస్ఐ పేరు చెప్పి ఒక వ్యక్తి నుంచి డబ్బులు లాగేశారు. విడతల వారీగా మొత్తం 50 వేల రూపాయలకు పైగా దోచుకున్నారు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
