వైఎస్ ను తలచుకొని బోరున ఏడ్చిన బొత్స...

వైఎస్ ను తలచుకొని బోరున ఏడ్చిన బొత్స...

వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోరున ఏడ్చేశారు బొత్స. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యారు బొత్స. వైఎస్ మరణం గురించి ప్రస్తావన వచ్చిన క్రమంలో కన్నీటి పర్యంతమయ్యారు బొత్స. ఇటీవల రాజధాని విషయంలో జగన్ ప్రతిపాదించిన మావిగన్ అంశంపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు బొత్స.

మావిగన్ గురించి జగన్ మాట్లాడిన క్షణం నుంచి కూటమి నేతలకు, చంద్రబాబుకు నిద్రలో కూడా అదే గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. మావిగన్ అంటే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు బొత్స. వైఎస్ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టిందని అన్నారు. వైఎస్ మరణం గురించి తానే అచ్చెన్నాయుడుకు చెప్పినట్లు అసత్య ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు.

మంత్రి అచ్చెన్నాయుడు లాంటి మనస్తత్వం, రాజకీయ అవసరాల కోసం చేసిన పనులు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. పార్టీ లేదు, బొక్కా లేదన్న మాటలు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. వైఎస్ మరణం గురించి దిగజారుడు మాట్లాడినందుకు తన ఆవేదన అని.. అచ్చెన్నాయుడు ఆలోచనలు మోకాలు నుంచి దిగజారి అరికాలులోకి వచ్చాయని అన్నారు.