డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ జాతీయ మీడియా సంస్థలపై కోర్టుకెక్కారు. ఇటవల తన వ్యాఖ్యలను వక్రీకరించి పరువు నష్టం కలిగించేలాప్రసారం చేశారని ఆరోపిస్తూ.. రెండు నేషనల్ ఛానళ్లకు లీగల్ నోటీసులిచ్చారు. బహిరంగ క్షమాపణ, ప్రసారం చేసిన కంటెంట్ ను తొలగించాలని, తనకు 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
స్టాలిన్ నోటీసు ప్రకారం.. ఆగస్టు 3న ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రెండు జాతీయ మీడియా సంస్థలు అసభ్యకరమైన వీడియోలను ప్రసారం చేసి ఆయన ప్రతిష్టకు నష్టం కలిగించారు. ఈ ఛానెళ్ల ను బేస్ చేసుకొని మిగతా ఛానళ్లు కూడా విస్తృతంగా ప్రచారం చేశాయని స్టాలిన్ నోటీసులో తెలిపారు.
తనపై తప్పుడు ప్రచారం చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ రెండు ఛానళ్లను ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. తమ టెలివిజన్ ఛానెళ్ల ద్వారా, అధికారిక, వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని మీడియా సంస్థలను నోటీసులో కోరారు. యూట్యూబ్ ,అన్ని ఇతర అధికారిక, వ్యక్తిగత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వీడియోలను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు ఉదయనిధి స్టాలిన్.
