సాధారణంగా ఏ జిమ్ అయినా ఒకరి తర్వాత ఒకరు ఎక్విప్మెంట్స్ షేర్ చేసుకుంటూ వ్యాయామం చేస్తుంటారు. జిమ్ లో ఎక్కువగా ఫ్రెండ్లి వాతావరణం ఉంటుంది. కానీ.. ఓ వ్యక్తి మాత్రం జిమ్ లో బలుపు ప్రదర్శించాడు. కొద్దిసేపు ఆగమని అన్నందుకు రచ్చ రచ్చ చేశాడు. దీంతో జిమ్ నిర్వాహకులు అతని మెంబర్షిప్ రద్దు చేశారు. బెంగుళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉన్న కల్ట్ ఫిట్ జిమ్‌లో తన వంతు కోసం వేచి ఉండమని అన్నందుకు ఒక వ్యక్తి 20 కేజీల జిమ్ ప్లేట్లను నేలపైకి విసిరిన వీడియో వైరల్ కావడంతో, ఆ జిమ్ యాజమాన్యం అతని సభ్యత్వాన్ని రద్దు చేసింది.
3–4 people were using a machine at a Cult gym in Bengaluru when a man came and asked them to move.
— Lakshay Mehta (@lakshaymehta08) September 19, 2026
They told him they were already using it and asked him to wait or take turns.
Instead, he got angry, removed the 20 kg plates and threw them forcefully on the floor. Those plates… pic.twitter.com/H1zVoOI8MH
ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియోలో ఒక మెషీన్‌ను ఉపయోగిస్తున్న మరో ముగ్గురు, నలుగురు సభ్యులు తన కోసం పక్కకు తప్పుకోకుండా, ఆగమని ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా వాడుకోమని అడిగినందుకు కోప్పడుతున్నట్లు ఉంది. కోపంతో మెషీన్ నుండి ప్లేట్లను తీసి బలంగా కిందకు విసిరేయడంతో ఒక ప్లేట్ దగ్గరలో ఉన్న ఒక వ్యక్తికి తగిలేంత పని జరిగింది.
సదరు వ్యక్తి ప్రవర్తనపై నిర్వాహకులకు రెండుసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని అంటున్నారు కస్టమర్లు. ఆ వ్యక్తి జిమ్‌లో షూటింగ్ కోసం ఒక ట్రైపాడ్‌ను ఏర్పాటు చేసుకున్నాడని, ఇది రూల్స్ కి విరుద్ధమని ఆరోపిస్తున్నారు కస్టమర్లు.
ALSO READ : మహమ్మద్ షమీ రాజకీయారంగేట్రం?
కల్ట్ ఫిట్ రియాక్షన్:
సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కల్ట్ ఫిట్ అతడి సభ్యత్వాన్ని రద్దు చేసింది. కస్టమర్ల భద్రతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే సహించేది లేదని.. ఈ ఘటనపై విచారణ జరిపి అతడి మెంబర్షిప్ రద్దు చేశామని తెలిపింది కల్ట్ ఫిట్ సంస్థ.
