భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'సంచలనం' అనే పదానికి నిలువెత్తు రూపం రామ్ గోపాల్ వర్మ. నిత్యం వివాదాలతోనో, విలక్షణమైన వ్యాఖ్యలతోనో వార్తల్లో ఉండే ఆర్జీవీ, ఈసారి తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా నెటిజన్లను షాక్‌కు గురిచేశారు. ఏప్రిల్ 7న తన 63వ పుట్టినరోజు జరుపుకున్న వర్మకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అయితే ఈ వేడుకల కంటే, అందులో వర్మ కనిపిస్తున్న తీరే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
గుర్తుపట్టలేనంతగా మారిన ఆర్జీవీ
ఒకప్పుడు ఎంతో ఎనర్జిటిక్‌గా, స్టైలిష్‌గా కనిపించే వర్మ.. ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా అత్యంత సన్నగా, బలహీనంగా కనిపిస్తున్నారు. బుధవారం బయటకు వచ్చిన పార్టీ వీడియోల్లో ఆయన శారీరకంగా చాలా కృశించిపోయి ఉండటం, ముఖంలో మునుపటి వర్చస్సు తగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో స్టైలిష్ డ్రెస్ ధరించి సందడి చేసినప్పటికీ, ఆయన భౌతిక రూపం మాత్రం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. నిజంగా ఈయనేనా రామ్ గోపాల్ వర్మ? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Me with @BajpayeeManoj , @geneliad and https://t.co/zPFKckFEaP at My B BASH pic.twitter.com/zk35sNcjIw
— Ram Gopal Varma (@RGVzoomin) April 9, 2026
ఆరోగ్యంపై అనుమానాలు.. ?
వర్మ ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఆయనకు ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య ఉందా? అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆయన కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారని అంటుంటే, మరికొందరు ఆయన ఏదైనా కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసం ఇలా బక్కచిక్కిపోయిన లుక్‌లోకి మారారా? అని చర్చించుకుంటున్నారు. అయితే తనపై వస్తున్న వార్తలను వర్మ తనదైన శైలిలో కొట్టిపారేశారు. ప్రతి ఏటా తన పుట్టినరోజున మరణం గురించి మాట్లాడే ఆయన, ఈసారి కూడా చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను.. కాబట్టి ఇది సెలబ్రేషన్ కాదు అంటూ ట్వీట్ చేసి తన విలక్షణ ఫిలాసఫీని చాటుకున్నారు.
నా గతాన్ని పొడుస్తున్నా..
అయితే లేటెస్ట్ ఆయన తన బర్త్ డే పార్టీ ఫోటోలను షేర్ చేశారు. #ధురందర్2 అనే కత్తితో నా గతాన్ని పొడుస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఇటీవల ఈ సినిమాను చూసి ఈ మూవీ షోలే సినిమా కంటే వంద రెట్టు అదర్భుతంగా ఉందన్నారు. డైరెక్టర్ అనే పదానికి స్పెల్లింగ్ ఆదిత్య ధర్ పేరుతోనే మొదలవుతుందేమో అని ప్రశంసించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ రంగాన్ని ధురంధర్ 2కు ముందు, తర్వాత అన్నట్లు గా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.
STABBING my PAST with a KNIFE called #Dhurandhar2 pic.twitter.com/nM8niWGnlv
— Ram Gopal Varma (@RGVzoomin) April 9, 2026
పాత వర్మ కోసం ఎదురుచూపులు
'శివ', 'సత్య', 'రంగీలా' వంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఆర్జీవీ, ప్రస్తుతం కేవలం బయోపిక్‌లు, పొలిటికల్ కాంట్రవర్సీలు, బోల్డ్ కంటెంట్‌కే పరిమితమయ్యారు. వర్మ శారీరకంగా బలహీనపడటం చూస్తుంటే, ఆయన మళ్ళీ అలాంటి మాస్టర్ పీస్ సినిమాలు తీయగలరా? అనే సందేహం ఫ్యాన్స్‌లో కలుగుతోంది. ఆర్జీవీ తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టాలంటే, ఆయన మళ్ళీ పాత ఉత్సాహంతో కెమెరా ముందుకు రావాల్సిందే. ఏదేమైనా, ఈ 'షాకింగ్ లుక్' వెనుక ఏదైనా సినిమా రహస్యం ఉందా లేక నిజంగానే వయసు ప్రభావమా అనేది కాలమే నిర్ణయించాలి..
D DAY pic.twitter.com/Ujkg4egUkH
— Ram Gopal Varma (@RGVzoomin) April 9, 2026
