ఈసారి 10 లక్షల సభ్యత్వాలు లక్ష్యం : ఏబీవీపీ స్టేట్ ప్రెసిడెంట్ రావుల కృష్ణ

ఈసారి 10 లక్షల సభ్యత్వాలు లక్ష్యం : ఏబీవీపీ స్టేట్ ప్రెసిడెంట్ రావుల కృష్ణ

హైదరాబాద్, వెలుగు: వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమని, ఆ మహాయజ్ఞంలో ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తోందని పరిషత్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌‌లో నిర్వహించిన ఏబీవీపీ సభ్యత్వ నమోదు వర్క్‌‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2026 –-27 విద్యాసంవత్సరానికి  తెలంగాణలో 10 లక్షల సభ్యత్వాలను నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.

పట్టణాల నుంచి మండల స్థాయి వరకు, చిట్టచివరి విద్యార్థి వరకు చేరువయ్యేలా కార్యకర్తలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతూనే, వారికి నాణ్యమైన విద్య అందేలా ఏబీవీపీ నిరంతరం అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంఘటన మంత్రి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, రాజశేఖర్, మలబిక, పృథ్వి,  జీవన్, హర్ష,   మహేశ్, రాజు, దీపిక పాల్గొన్నారు.