180 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడి అరెస్ట్

180 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడి అరెస్ట్

సైఫాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 180 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆసిఫ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన నిరుద్యోగి మహ్మద్ ఫైజల్ షా అలీ జబ్రీ అలియాస్ అబ్దుల్లా అలియాస్ సొహైల్ అలియాస్ అల్తాఫ్ 2023లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైఫాబాద్, మొగల్‌‌‌‌‌‌‌‌పుర, చార్మినార్, నాంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చైన్ స్నాచింగ్‌‌‌‌‌‌‌‌లకు పాల్పడ్డాడు. ఇతనిపై 14 నాన్ -బెయిలబుల్ కేసులు ఉన్నాయి. 

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మొదట బెంగళూరుకు పారిపోయి కొంతకాలం అక్కడే తలదాచుకున్నాడు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని రాయచోటికి మకాం మార్చి, రాయచోటి, చేనూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో మూడు చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. హైదరాబాద్ సిటీ డిటెక్టివ్ డిపార్ట్​మెంట్ డీసీపీ చైతన్య కుమార్ గైడెన్స్, సీసీఎస్ స్పెషల్​క్రైం టీమ్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో సీఐ సుధాకర్ రావు బృందం అల్తాఫ్​ను మంగళవారం అరెస్ట్​చేసింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు