మాజీ మిస్ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్, నటి ట్విషా శర్మ (Twisha Sharma) మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మే 12న భోపాల్ లోని కటారా హిల్స్ ప్రాంతంలో అత్తవారింట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించి ప్రశ్నార్ధకంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఆమె భర్త లాయర్ సమర్థ్ సింగ్తో పాటుగా అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ లపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు వరకట్న వేధింపులు సహా పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు, సమర్థ్ సింగ్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్‌లో ట్విషా డ్రగ్స్ కి బానిస అయిందని, మెంటల్ కండీషన్ బాలేదని, అందుకు ట్రీట్ మెంట్ తీసుకుంటుందని పేర్కొనడంతో ఈ కేసు మరింత వివాదానికి దారితీసింది.
సూసైడ్ చేసుకుందంటే నమ్మలేకపోతున్నా..
కన్నడ హీరో, గర్ల్ ఫ్రెండ్ ఫేమ్ దీక్షిత్ శెట్టి నటి ట్విషా శర్మ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విషాతో కలిసి తెలుగులో 2021లో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు సినిమాలో నటించిన అనుభవాన్ని పంచుకుంటూ, ట్విషా వ్యక్తిత్వం ఎలా ఉండేదో చెప్పుకొచ్చాడు. “ఇది చాలా దిగ్భ్రాంతికరమైన వార్త. ట్విషా శర్మ ఎంతో కష్టపడే, ఉత్సాహంగా ఉండే అమ్మాయి. అలాంటి ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయం నమ్మలేకపోతున్నాను” అని దీక్షిత్ శెట్టి అన్నారు. ఇన్నాళ్లు తనతో టచ్‌లో లేనని, చివరిసారిగా నాలుగేళ్ల క్రితం మాట్లాడామని దీక్షిత్ తెలిపారు.
ముఖ్యంగా ట్విషాకు పెళ్లయిందన్న విషయం కూడా తెలియదని నటుడు దీక్షిత్ తెలిపారు. ఒక్క సినిమాలో మాత్రమే కలిసి పనిచేశామని, తర్వాత ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయిందని చెప్పారు. మాస్టర్స్ చేయాలని, నటన తన ఆశించిన స్థాయిలో లేదని ఆమె చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ట్విషా శర్మ నటన కంటే చదువుపై, కుటుంబ జీవితం కోసమే ఆలోచించిందని.. ఇలా అనుమానస్పద రీతిలో ట్విషా చనిపోవడంపై దీక్షిత్ విచారం వ్యక్తం చేసాడు.
►ALSO READ | కనిపించకుండా పోయిన లేడీ సింగర్.. వారం తర్వాత కాలువలో డెడ్ బాడీ !
అలాగే ముగ్గురు మొనగాళ్లు దర్శకుడు అభిలాష్ రెడ్డి కూడా ట్విషా మరణంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులు ఎంతో మంచివారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులోని నిజానిజాలు విచారణ తర్వాతే తేలనున్నాయి.
మానసిక పరిస్థితి బాలేదని అత్త గిరిబాల వ్యాఖ్యలు..
ముందస్తు బెయిల్‌పై ఉన్న అత్తగారు, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పెళ్లి తర్వాత ట్విషా ప్రవర్తనలో మార్పులు కనిపించాయని, ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన తర్వాత తీవ్ర భావోద్వేగ ఒత్తిడికి లోనైందని ఆమె ఆరోపించారు. ప్రెగ్నెన్సీపై ఆందోళన వ్యక్తం చేస్తూ గర్భాన్ని తొలగించాలంటూ పట్టుబట్టిందని, తనను తాను హింసించుకుంటూ ‘నేను ఇలా బతకలేను’ అని ఏడ్చిందని.. ఈ మానసిక ఒత్తిడే ఆమె మరణానికి కారణమై ఉండొచ్చని అత్తగారు వాదించారు. అయితే ఇవి ఆరోపణలు మాత్రమే కాగా, కేసులో నిజానిజాలు దర్యాప్తు తర్వాతే తేలాల్సి ఉంది.
#WATCH | Bhopal, MP | Twisha Sharma death case | Mother-in-law of the victim and retired judge Giribala Singh says, "Within 5 months, I realised that she held quite liberal views... on the 17th, the moment she received confirmation of her pregnancy, her entire demeanour changed;… pic.twitter.com/LYZ5SW2R3S
— ANI (@ANI) May 19, 2026
