నటుడు మహేశ్ బాబు ఫొటో షూట్ లో తొక్కిసలాట

నటుడు మహేశ్ బాబు ఫొటో షూట్ లో తొక్కిసలాట

హైదరాబాద్ లోని గబ్చిబౌలిలో జరుగుతున్న సినీ నటుడు మహేశ్ బాబు షూటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా మహేశ్ బాబుతో ఫ్యాన్స్ కోసం ఫొటో షూట్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడితో ఫొటో దిగేందుకు ఎగబడటంతో షూట్ లో  తొక్కిసలాట జరిగి.. బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సమాచారమిచ్చింది. గాయపడిన వారిని లింగంపల్లి సన్ షైన్  ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మహేశ్ బాబు బౌన్సర్లు కూడా తమపై దాడి చేశారంటూ ఆరోపించారు ఫ్యాన్స్. తొక్కిసలాట జరగడంతో షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయాడు మహేశ్ బాబు.