IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ లో భాగంగా ఈరోజు (2026, ఏప్రిల్ 10న) గౌహతిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ఈ రెండు జట్లు, తమ విజయ పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాయి. రెండు జట్లు ప్రస్తుతం అదిరిపోయే ఫామ్‌లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో రెండు టీమ్‌లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. గౌహతి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో, మరోసారి ఈ మైదానంలో పరుగుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
సోషల్ మీడియాలో చర్చ:
ఈ ఉత్కంఠ పోరుపై సోషల్ మీడియాలో తెగ చర్చ కొనసాగుతుంది. ఒకవైపు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీల బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది.. ఈ మ్యాచులో ఎవరు పైచేయి సాధిస్తారని డిస్కషన్ చేస్తున్నారు. కోహ్లీ క్లాసీ షాట్స్ తో చెలరగనుండగా.. సూర్యవంశీ మాత్రం తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించడంలో యశస్వీ జైస్వాల్ కూడా పాత్ర కీలకం కానున్నాడు.
►ALSO READ | ఒకే ఇన్నింగ్స్ 9 వికెట్లు ..బ్రెజిల్ బౌలర్ లారా వరల్డ్ రికార్డ్
తుది జట్ల అంచనా:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డి. ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్.
ఇంపాక్ట్ ప్లేయర్: తుషార్ దేశ్‌పాండే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, ఎ. సింగ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ.
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ
