IPL 2026: ఆర్సీబీ కెప్టెన్ ఒంటరి పోరాటం.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్!

IPL 2026: ఆర్సీబీ కెప్టెన్ ఒంటరి పోరాటం.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ లో భాగంగా గౌహతిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న కీలక పోరులో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్  రజత్ పాటిదార్ (63) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేయగా, చివర్లో వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణించడంతో జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ జట్టుకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఇన్సింగ్స్ మొదటి ఓవర్ వేసిన జోఫ్రా అర్చర్ ఓ అద్భుతమైన బంతిని ఆడబోయి, వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కి క్యాచ్ ఇచ్చి ఆర్సీబీ బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0) గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో పరుగుల ఖాతా ఓపెన్ చేయకుండానే ఫస్ట్ వికెట్ ని నష్టపోయింది. అనంతరం బ్యాటింగ్ విరాట్ కోహ్లీ ( 16 బంతుల్లో 7 ఫోర్లతో 32 పరుగులు) కాసేపు పోరాటం చేసినప్పటికీ రవి బిష్ణోయ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన దేవదత్ పడిక్కల్ (14) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద షిమ్రాన్ హెట్మెయర్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇక బ్యాటింగ్ లో ప్రమోషన్ పొందిన కృనాల్ పాండ్యా నిరాశ పరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన తర్వాత రవి బిష్ణోయ్ బౌలింగ్ లో హెట్మెయర్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్ కి వెళ్లిపోయాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన జితేష్ శర్మ సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక జస్ట్ 6 రన్స్ చేసి బ్రిజేష్ శర్మ బౌలింగ్ లో LBW గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన టీమ్ డేవిడ్ కూడా ఈసారి తీవ్రంగా నిరాశపరిచాడు, కేవలం 13 పరుగులు మాత్రమే చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 

►ALSO READ | IPL 2026: పంజా విసిరిన రాజస్థాన్.. 10 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ..

ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన రొమారియో షెపర్డ్(22) దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రవీంద్ర జడేజా బౌలింగ్ లో పెవిలియన్ కి వెళ్లిపోయాడు. దీంతో వరుసగా వికెట్లు పడుతుండటంతో.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్  ( 40 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సులతో 63 పరుగులు)  చెలరేగిపోయాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో దూసుకుపోతున్న అతడ్ని సందీప్ శర్మ ఓ అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించాడు. చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్) తన ఇంపాక్ట్ చూపించాడు. చివరి ఓవర్లో ఏకంగా 21 పరుగులు రాబట్టడంతో.. ఆర్సీబీ 20 ఓవర్లలో 201 పరుగులు చేయగా, ఆర్ఆర్ జట్టు టార్గెట్ 202 పరుగులు చేయాల్సి ఉంది. రాజస్థాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ తలో రెండు వికెట్లు తీసుకోగా, సందీప్ శర్మ, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.