వరంగల్ జిల్లా ఆత్మకూరు SI సస్పెన్షన్

వరంగల్ జిల్లా ఆత్మకూరు SI సస్పెన్షన్

వరంగల్ జిల్లా ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఎస్సై సతీష్ ను సస్పెండ్ చేస్తూ  వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం (ఏప్రిల్ 10) ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సైపై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన సీపీ.. అవినీతి నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఎస్సై సతీష్ అవినీతికి పాల్పడటమే కాకుండా.. పలు కేసులో అలసత్వం వహించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. పలు కేసుల్లో బాధితుల పక్షాన కాకుండా నిందితులకు అండగా ఉంటూ కేసులపై అసలత్వం వహించినట్లు ఆరోపణలున్నాయి. అదే విధంగా బాధితులతో దురుసుగా వ్యవహరించినట్లు కూడా ఆరోపణలున్నాయి. తరచుగా వస్తున్న ఫిర్యాదులను స్వీకరించిన సీపీ.. విచారణ జరిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.