టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అడివి శేష్, నేచురల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ . ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు ఈరోజే ( ఏప్రిల్ 10న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ తన పాత్రల ఎంపిక , భారతీయ సినిమాలో మహిళా పాత్రల చిత్రణపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
అసలు సిసలైన పాత్రల కోసం అన్వేషణ!
సినిమా ప్రమోషన్ల లో భాగంగా మృణాల్ ఠాకూర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా, ఎంతో లోతైన, వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా లోపాలున్న, సహజంగా ఉండే పాత్రలు చేయడానికి తాను ఇష్టపడుతున్నానని మృణాల్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో నాకు ఎక్కువ మంది రైటర్లు, దర్శకులు తెలియకపోవచ్చు. కానీ, నేను ఎప్పుడూ ఒకటే వెతుకుతాను.. కథలో నా పాత్ర ఎంత సహజంగా ఉంది? అని. లోపాలున్న మనుషులే అసలైన మనుషులు, అవే బెస్ట్ క్యారెక్టర్స్. అలాంటి పాత్రలు నేను ఎందుకు చేయకూడదు? అని ఆమె ప్రశ్నించారు.
మహిళా ప్రధాన చిత్రాలపై ఆవేదన
భారతీయ సినిమాలో మహిళా పాత్రలపై మృణాల్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మహిళల గురించి అందరూ రాయడం లేదు. పాతకాలపు మూస ధోరణులను బ్రేక్ చేసే సినిమాలు రావాలి. 'ది డర్టీ పిక్చర్', 'క్వీన్' వంటి సినిమాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో పెద్ద మార్పు కనిపించింది. కానీ, అలాంటి కథలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది అని ఆమె పేర్కొన్నారు. హీరోయిన్ అంటే కేవలం పాటలకు, గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథను నడిపించే శక్తిగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
►ALSO READ | Michael Jackson Biopic : కింగ్ ఆఫ్ పాప్ ఈజ్ బ్యాక్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘మైఖేల్’ బయోపిక్ ట్రైలర్!
‘డెకాయిట్’లో మ్యాజిక్!
ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ‘డెకాయిట్’లో మృణాల్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. అడివి శేష్‌తో ఆమె కెమిస్ట్రీ , ఎమోషనల్ సీన్స్‌లో పండించిన హావభావాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మొత్తానికి 'సీతారామం'తో తెలుగు వారి గుండెల్లో గూడు కట్టుకున్న మృణాల్, ఇప్పుడు 'డెకాయిట్'తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. కేవలం అందంతోనే కాకుండా, ఆలోచనలతోనూ ఆమె నిజమైన స్టార్ అనిపించుకుంటోంది.
