ఏం మనుషులురా అనే రోజులుపోయి.. అమ్మ బాబోయ్ అమ్మాయిలు.. అయ్య బాబోయ్ భార్యలు అనే రోజులు వచ్చాయి. వంటింట్లో కూరగాయలు తరిగినట్లు.. ఇంట్లోనే మొగుళ్లను ఈజీగా లేపేస్తున్నారు భార్యలు. మొన్నటికి మొన్న హనీమూన్ కు తీసుకెళ్లి మొగుడిని చంపింది ఓ భార్య.. ఆ తర్వాత మాల్ కు తీసుకెళ్లి లేపేసింది మరో భార్య.. వీటన్నింటి కంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా గోండిఖేడ గ్రామంలో జరిగిన ఈ హత్య మాత్రం అల్టిమేట్.
భార్య ప్రియాంక, భర్త దేవకృష్ణ. పెళ్లయ్యి ఆరేళ్లు అవుతుంది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య గొడవలే. భర్త నల్లగా ఉన్నాడంటూ సూటిపోటి మాటలు. నాలాంటి అందమైన అమ్మాయికి నువ్వు తగని వాడివి అంటూ ఇంట్లో గొడవలు. మేడ్ ఫర్ ఈచ్ కాదని అంటూ ఉండేది ప్రియాంక. చాలా సార్లు విడాకుల ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చేసింది. రెండు కుటుంబాలు దీనికి ఒప్పుకోలేదు. పంచాయితీ పెట్టి సర్దిచెప్పారు పెద్దలు.
ఈ క్రమంలోనే ప్రియాంకకు తన భర్త కంటే అందమైన వాడు.. తెల్లగా ఉన్న కమలేష్ దొరికాడు. ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవాళ్లు. ఐదేళ్లుగా వీళ్ల బంధం కొనసాగుతుంది. ఈ విషయం భర్తకు తెలియటంతో.. ఇంట్లో గొడవలు పెరిగాయి. పెద్దల పంచాయితీ. విడాకులు ఇవ్వటం లేదు.. నచ్చినవాడితో ఉండనివ్వటం లేదన్న కోపం పెంచుకున్నది భార్య ప్రియాంక.
ఈ క్రమంలోనే భర్తను చంపేయాలని ప్లాన్ వేసింది. లవర్ కమలేష్ తో కలిసి దొపిడీ దొంగల దాడిగా పథకం రచించింది. లవర్ కమలేష్ ఒక్కడే చేయలేడని భావించి.. అతనికి సాయం చేయటం కోసం లక్ష రూపాయులు ఇచ్చి సురేంద్ర అనే ఓ వెధవను అసిస్టెంట్ గా పెట్టుకున్నారు.
2026, ఏప్రిల్ 8వ తేదీ రాత్రి లవర్ కమలేష్, సురేంద్రలు దోపిడీ దొంగలుగా ప్రియాంక ఇంటిపై దాడి చేశారు. ప్రియాంక, అతని భర్త దేవ కృష్ణపై దాడి చేశారు. ఈ దాడిలో దేవ కృష్ణ చనిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విచారణ ప్రారంభం అయ్యింది.
దోపిడీ దొంగలు దాడి చేశారని.. ఇంట్లోని బంగారం. 3 లక్షల డబ్బు ఎత్తుకెళ్లారని.. అడ్డుకున్న నన్ను ఓ గదిలో బంధించారని.. నా భర్త దేవ కృష్ణను చంపేశారని స్టేట్ మెంట్ ఇచ్చింది ప్రియాంక. విచారణలో సీన్ మాత్రం చాలా తేడాగా కనిపించింది పోలీసులకు. డబ్బు, బంగారం ఇంట్లోనే ఉండటంతో.. బంధువులు, చుట్టాలు చెప్పిన విషయాలు అన్ని పరిశీలిస్తే ప్రియాంకపై అనుమానం వచ్చింది పోలీసులకు.
సెల్ ఫోన్ కాల్ రికార్డులు, ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు అన్ని పరిశీలించిన తర్వాత భార్య ప్రియాంకనే.. భర్త దేవ కృష్ణను ప్లాన్ చేసి హత్య చేయించినట్లు స్పష్టం అయ్యింది.
భర్త నల్లగా ఉన్నాడని.. నాలాంటి అందమైన అమ్మాయికి తగిని వాడు కాదు అని.. విడాకులు ఇవ్వటం లేదని.. అందుకే చంపినట్లు చెప్పుకొచ్చింది. దోపిడీ దొంగల దాడిగా చిత్రీకరించి.. ఆ తర్వాత లవర్ కమలేష్ తో హ్యాపీగా జీవితాన్ని గడపొచ్చు అని భావించానంటూ విచారణలో క్లారిటీ ఇచ్చింది భార్య ప్రియాంక.
ఏదిఏమైనా ఈ కాలంలో కూరగాయలు కోసినంత ఈజీగా భర్తలను భార్యలు చంపటం అనేది ఏదైతే ఉందో చాలా దారుణం.
