కరోనా పై ఫైట్ కు 11 వేల కోట్లు ఇవ్వనున్న ఏడీబీ

కరోనా పై ఫైట్ కు 11 వేల కోట్లు ఇవ్వనున్న ఏడీబీ

ముంబై : కరోనా పై ఫైట్ కు మనదేశానికి ఆర్థికంగా సహాయం అందించేందుకు ఆసియన్ డెవలప్ మెంట్ (ఏడీబీ) బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 11, 000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ డబ్బును కరోనా నివారణకు… లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద వారిని ఆదుకునేందుకు మనదేశం ఖర్చు చేయనుంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి తిండి కూడా దొరకటం లేదు. ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీగా తగ్గింది. దీంతో ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఈ డబ్బు ఉపయోగపడనుంది. 2020 మార్చిలో కేంద్రం ఎమర్జెన్సీ క్విక్ రియాక్ట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి ఏడీబీ అందించే ఆర్థిక సహాయం ఎంతో కీలకం కానుంది. గ్రోత్ రేట్ పెంచేందుకు కావాల్సిన సపోర్ట్ ను ఏడీబీ నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. స్మాల్ అండ్ మీడియా స్కేల్ పరిశ్రమలు ఎఫెక్ట్ కాకుండా వాటికి రాయితీలు, ప్రోత్సహాకాలు ఇచ్చేందుకు బ్యాంక్ రుణాన్ని వినియోగించనుంది.