పోలీస్​శాఖలో భారీగా బదిలీలు.... 30 మంది ఏఎస్పీలు ట్రాన్సఫర్​

పోలీస్​శాఖలో భారీగా బదిలీలు.... 30 మంది ఏఎస్పీలు ట్రాన్సఫర్​

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పోలీసు శాఖలో ట్రాన్సఫర్ల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు ( మే 22)  30 మంది ఏఎస్పీలనుబదిలీ చేస్తూ డీజీపీ జితేందర్  అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

రెండు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీ లు, అదేవిధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో 27 మంది ఏసీపీ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.  పోలీస్​ శాఖలో  వరుస ట్రాన్స్‌ఫర్లు  ...  సంబంధిత శాఖ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.