గుడిహత్నూర్, వెలుగు: నేషనల్ హైవే, ఇంటర్ స్టేట్ రోడ్ల వెంట ఉన్న దాబాల యజమానులు భారీ వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఒకవేళ అనుకోని ప్రమాదాలు జరిగితే దాబా ఓనర్లపై చర్యలు తప్పవని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలోని దాబా ఓనర్లతో శుక్రవారం గుడిహత్నూర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దాబాల్లో మద్యం, గంజాయి తాగడం, అమ్మడం పూర్తిగా నిషేధమన్నారు. ప్రతి దాబాలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని,ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఇచ్చోడ సీఐ నరేశ్, ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
