ఒకే దేశం.. ఒకే సమయం.. మిల్లీ సెకన్ల వ్యత్యాసం కూడా లేకుండా కొత్త నెట్ వర్క్ ప్రారంభం

ఒకే దేశం.. ఒకే సమయం.. మిల్లీ సెకన్ల వ్యత్యాసం కూడా లేకుండా కొత్త నెట్ వర్క్ ప్రారంభం

సమయం అనేది ఆధునిక  ప్రపంచానికి  వెన్నెముక.  బ్యాంకు లావాదేవీలు,  రైల్వే షెడ్యూల్,  టెలికాం నెట్‌‌‌‌వర్క్,  విద్యుత్ గ్రిడ్,  స్టాక్ మార్కెట్  అన్నీ  ఒకే  సమయంతో సరిగ్గా సింక్ అయితేనే  సజావుగా  నడుస్తాయి.   భారత ప్రభుత్వం ‘వన్‌‌‌‌ నేషన్‌‌‌‌,  వన్‌‌‌‌ టైమ్‌‌‌‌’లో భాగంగా భారత ప్రామాణిక సమయం (ఐఎస్‌‌‌‌టి)ను మరింత కచ్చితంగా సరఫరా చేయడం కోసం వైట్ రాబిట్ టెక్నాలజీ ఆధారిత నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను ప్రారంభించింది.  భారతదేశానికి  అధికారిక  సమయంగా..  భారత  ప్రామాణిక  సమయం(ఐ.ఎస్.టి)ను  పూణేలోని - నేషనల్ ఫిజికల్ లాబరేటరీ (ఎన్‌‌‌‌పిఎల్) నిర్వహిస్తోంది.  

కానీ  దేశమంతటా  మిల్లీ సెకన్ల  వ్యత్యాసం కూడా  లేకుండా ఈ సమయాన్ని నిర్వహించడం  ఒక పెద్ద సవాలు.  ఈ సమస్యకు  పరిష్కారంగా  సిఎస్​ఐఆర్,  -ఎన్​పిఎల్,  సిడిఓటి,  ఇతర సంస్థలు కలిసి వైట్ రాబిట్  టెక్నాలజీ ఆధారంగా  ఐఎస్‌‌‌‌టి  పంపిణి  నెట్‌‌‌‌ వర్క్‌‌‌‌ను  అభివృద్ధి చేశాయి.   వైట్ రాబిట్ అనేది సిజిఆర్ఎన్ అభివృద్ధి చేసిన అత్యంత  కచ్చితమైన  సమయ  సమకాలీకరణ  టెక్నాలజీ.  ఇది ఎర్త్ నెట్ ఆధారంగా పనిచేస్తుంది.  నానో సెకన్ల స్థాయిలో  కచ్చితత్వాన్ని ఇస్తుంది. 

ఫైబర్ ఆప్టిక్ లింక్ ద్వారా ఐఎస్‌‌‌‌టి  సిగ్నల్‌‌‌‌

బెంగళూరులోని  ఎన్‌‌‌‌పిఎల్... ఐఎస్‌‌‌‌టి  సిగ్నల్‌‌‌‌ను  ఫైబర్ ఆప్టిక్ లింక్ ద్వారా వివిధ పరిశోధనా సంస్థలు, ఇస్రో  కేంద్రాలు,  విశ్వవిద్యాలయాలు,  పరిశ్రమలకు పంపిణి చేసే  ప్రదర్శన నెట్‌‌‌‌వర్క్  ఏర్పాటు  చేశారు.  ఈ  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో  వైట్ రాబిట్ స్విచ్‌‌‌‌లు,  నోడ్‌‌‌‌లను ఉపయోగిస్తారు.  ప్రధాన సర్వర్ నుంచి వచ్చే  ఐఎస్‌‌‌‌టి  సిగ్నల్‌‌‌‌ను  ఈ  పరికరాలు ఎటువంటి  జాప్యం లేకుండా చివరి యూజర్  వరకు చేరవేస్తాయి.  ఈ వ్యవస్థ వల్ల  కలిగే  ప్రయోజనాలు చాలా ఉన్నాయి.  

మొదటిది కచ్చితత్వం.  సాధారణ ఎన్‌‌‌‌టిపీ సర్వర్లు  మిల్లీ సెకన్ల లోపం ఇస్తే,  వైట్ రాబిట్  నానో  సెకన్ల లోపాన్నే ఇస్తుంది.  రెండోది  భద్రత.  దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ నెట్‌‌‌‌వర్క్ వల్ల విదేశీ  జిపిఎస్  సిగ్నల్‌‌‌‌పై  ఆధారపడాల్సిన  అవసరం  తగ్గుతుంది.  మూడోది  ఖర్చు తగ్గింపు.  ప్రతి సంస్థ  ప్రత్యేకంగా అణు గడియారం  కొనాల్సిన అవసరం ఉండదు.  ఇస్రో  బ్యాంకింగ్,   డిఫెన్స్, 5జీ  టెలికాం లాంటి రంగాలకు ఈ  నెట్‌‌‌‌వర్క్  చాలా ఉపయోగపడుతుంది.  

ఉదాహరణకు  రెండు బ్యాంకుల మధ్య లావాదేవీ  జరిగినప్పుడు సమయంలో 1 మిల్లీ సెకన్  తేడా కూడా  పెద్ద నష్టానికి  కారణం  అవుతుంది.   బెంగళూరులోని  వైట్ రాబిట్ ఆధారిత ఎస్ఐటి  పంపిణి  ప్రదర్శన  నెట్‌‌‌‌వర్క్ ‘డిజిటల్ ఇండియా’,  ఆత్మనిర్భర్ భారత్  లక్ష్యాలకు ఒక పెద్ద  కీలక అడుగు.  భవిష్యత్తులో ఇలాంటి  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లను  దేశమంతటా విస్తరించడం ద్వారా  భారతదేశం సమయ పంపిణిలో  ప్రపంచంలోనే  ముందు వరుసలో  నిలుస్తుంది. 

- ఇరికి మహేష్, 
న్యాయవాది
డా.  అంబేద్కర్ 
జాతీయ అవార్డు గ్రహీత

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.