సంబురంగా తీజ్ ఉత్సవాలు.. ఆదిలాబాద్ జిల్లా గిరిజన తండాల్లో పెళ్లికాని యువతుల సందడి

సంబురంగా తీజ్ ఉత్సవాలు.. ఆదిలాబాద్ జిల్లా గిరిజన తండాల్లో పెళ్లికాని యువతుల సందడి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తండాల్లో తీజ్ సంబరాలు అంబరాన్నంటాయి. పెళ్లి కాని యువతులు రాఖీ పౌర్ణమి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉండి, బుట్టలలో గోధుమ ధాన్యం అలికారు. చివరి రోజున గోధుమ మొలకలు వచ్చిన బుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసి, పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సందడి చేశారు. అనంతరం గ్రామపెద్దల ఆశీర్వాదం తీసుకుని మొలకల బుట్టలను చెరువులో నిమజ్జనం చేశారు. యువతులకు మంచి భర్త దొరకాలని, ఊరంతా పాడి పంటలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ తీజ్ వేడుకలు నిర్వహిస్తారని గ్రామస్తులు తెలిపారు.