మేం బాంబులు వేస్తాం… శవాల లెక్క కేంద్రమే చెప్పాలి

మేం బాంబులు వేస్తాం… శవాల లెక్క కేంద్రమే చెప్పాలి

కోయంబత్తూర్ : ఫిబ్రవరి 26న పాక్ ఆక్రమిత కశ్మీర్ అవతల బాలాకోట్ లో జరిపిన వైమానిక దాడులపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా కోయంబత్తూరులో స్పందించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలపైనే ఆరోజు దాడి చేశామన్నారు. అడవుల్లో బాంబులు వేస్తే.. పాకిస్థాన్ కు నష్టం కలిగేది కాదని.. ఏ నష్టం కలగనప్పుడు పాకిస్థాన్ తిరిగి ఎందుకు రియాక్టవుతుందని అన్నారు. ప్రాణ నష్టం జరిగింది కాబట్టే… పాకిస్థాన్ తిరిగి ఎయిర్ స్ట్రైక్ కు ప్రయత్నించిందని వివరించారు ధనోవా.

టార్గెట్లు ఎంచుకుని ఆపరేషన్ నిర్వహించడం… బాంబులతో దాడి చేయడమే ఎయిర్ ఫోర్స్ పని అని ధనోవా చెప్పారు. దాడుల్లో ఎంతమంది చనిపోయారన్న విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందన్నారు. ప్రాణ నష్టం అంచనా, మానవ మరణాలను లెక్కించడం తమ పని కాదన్నారు. ఎన్ని టార్గెట్లను కొట్టామన్నదే ఎయిర్ ఫోర్స్ లెక్క అని వివరించారు.

పాకిస్థాన్ ఎఫ్ 16 విమానం భారత మిలటరీ బలగాలను టార్గెట్ చేసినప్పుడు రెండు రకాలుగా ఎయిర్ ఫోర్స్  తిప్పికొట్టిందని చెప్పారు. అందులో ఒకటి మాత్రమే ప్రణాళిక ప్రకారం జరిపిన దాడి అని చెప్పిన బీఎస్ ధనోవా.. రెండోది అప్పటికప్పుడు అనుకుని జరిపిన ఎటాక్ అన్నారు. మిగ్ 21 కూడా సత్తా కలిగిన ఫైటర్ విమానమే అని అన్నారు. మిగ్ 21 ను అప్ గ్రేడ్ చేశామనీ.. మిసైల్స్, నాణ్యమైన ఆయుధాలను అది మోసుకెళ్లగలదని చెప్పారు ధనోవా.