హైదరాబాద్, వెలుగు: ఇటీవల ప్రారంభించిన ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు తమ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు ఆటోమేటిక్‌గా మారుతారని ఎయిర్‌టెల్ ఎండీ శశాంక్‌శర్మ వినియోగదారులకు రాసిన లెటర్లో పేర్కొన్నారు. ఈ ప్లాన్లు రద్దీగా ఉండే ప్రాంతాలలో కూడా వేగంగా నెట్ అందిస్తాయి. ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ సేవల కోసం పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు మారవచ్చు.
ఎయిర్‌టెల్ ఈనెల 19న ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ వాడడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు, రద్దీ ప్రదేశాల్లోనూ సులభంగా వీడియో కాల్స్, డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీతో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ప్రత్యేక
నెట్‌వర్క్ లైన్ లభిస్తుంది.
