Aishwarya Rajesh: బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేష్‌కు పవర్‌ఫుల్ రోల్..? 'NBK112' పై మైండ్‌బ్లోయింగ్ న్యూస్!

Aishwarya Rajesh: బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేష్‌కు పవర్‌ఫుల్ రోల్..? 'NBK112' పై మైండ్‌బ్లోయింగ్ న్యూస్!

 నందమూరి బాలకృష్ణ , కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న  భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'NBK112'. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి . లేటెస్ట్ గా ఈ ప్రాజెక్టు చుట్టూ ఒక క్రేజీ మైండ్ బ్లోయింగ్ రూమర్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విక్టరీ వెంకటేష్ సరసన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

లేటెస్ట్ గా 'ఓ..! సుకుమారి' చిత్రంలో దామిని అనే గ్రామీణ యువతిగా డి-గ్లామ్ లుక్‌లో తిరువీర్‌ సరసన నటించి, తన సహజ నటనతో మెప్పించింది ఐశ్వర్య రాజేష్.. ఇప్పుడు ఈ బ్యూటీ ఏకంగా నటసింహం బాలయ్య మూవీలో ఛాన్స్ కొట్టేసిందన్న టాక్ టాలీవుడ్ లో  వినిపిస్తోంది. అయితే ఇందులో హీరోయిన్‌గా కాకుండా కథకు ప్రధాన బలంగా నిలిచే పవర్‌ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది సాధారణ విలన్ పాత్ర కాదని, బాలకృష్ణ పాత్రకు సమానంగా సవాల్ విసిరే బలమైన క్యారెక్టర్‌గా దర్శకుడు కొరటాల శివ డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది.  పాత్రలో భావోద్వేగాలు, తీవ్రత, యాక్షన్‌కు సమాన ప్రాధాన్యం ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక కొరటాల శివ ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్య పవర్‌ఫుల్ మాఫియా లీడర్‌గా డిఫరెంట్ అవతార్‌లో కన్పించనున్నారని  సమాచారం. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మలినేని గోపిచంద్ దర్శకత్వంలో 'NBK111' మూవీలో బాలయ్య నటిస్తున్నారు. ఇటీవల కాకినాడ పోర్టు సమీపంలో జరుగుతున్న యాక్షన్ సీన్ లో బాలకృష్ణ కాలికి గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.