
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించడం లేదన్నారు. ఏదో ఒక మూల కూర్చొని వెహికిల్స్కు చలాన్లు వేస్తున్నారని మండిపడ్డారు. కరోనా తర్వాత అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగాయని..వాటితోనే జనం ఇబ్బంది పడుతుంటే..ట్రాఫిక్ చలాన్లతో పోలీసులు మరింత ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. పెరిగిన గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలతో జనం పరేషాన్ అవుతున్నారని...ఇంటి నుంచి బయటకు వస్తే ట్రాఫిక్ పోలీసులను చూసి మరింత పరేషాన్ అవుతున్నారని తెలిపారు. ట్రాఫిక్ చలాన్లతో పేదవాళ్లే ఇబ్బంది పడుతున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. చిన్న చిన్న చలాన్లు ఉంటే మాఫీ చేసే ఆలోచన చేయాలని కోరారు.