రిలీజ్కు ముందే రికార్డ్.. ఇండియా నుండి పుష్ప2 ఒక్కటే!

రిలీజ్కు ముందే రికార్డ్.. ఇండియా నుండి పుష్ప2 ఒక్కటే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప(Pushpa) సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో పుష్ప సాధించిన రికార్డ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక తాజాగా ఏ పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప2(Pushpa2) కూడా రికార్డుల మోతమోగిస్తోంది. 

విడుదలకు ముందే ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున పుట్టినరోజు సంధర్బంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. గంగమ్మ జాతరలో లేడీ గెటప్ లో ఉన్న వ్యక్తిగా బన్నీ లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో ఈ లుక్ ఇప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అదేమంటే ఇంస్టాగ్రామ్ లో ఏడు మిలియన్ లైక్స్ సాధించిన ఫస్ట్ లుక్ గా నిలిచింది రికార్డ్ సృష్టించింది. అంతేకాదు ఇండియా నుండి ఈ ఘనత సాధించిన ఫస్ట్ మూవీగా పుష్ప2 ఫస్ట్ లుక్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ న్యూస్ తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  

ఇక పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో..  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 దసరా కానుకగా రిలీజ్ కానుంది. మరి రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.