మరో తమిళ చిత్రంలో కయాదు లోహర్ 

మరో తమిళ చిత్రంలో కయాదు లోహర్ 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది కయాదు లోహర్.  ఈ ఏడాది ఇప్పటికే తను నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి.  రీసెంట్‌‌గా ‘ది ప్యారడైజ్‌‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మరో మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగానే మరో కొత్త సినిమా తన ఖాతాలో చేరింది.  శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది.  ‘పార్కింగ్‌‌’ ఫేమ్ రామ్ కుమార్‌‌‌‌ బాలకృష్ణన్ దీనికి దర్శకుడు.  

శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  ఓపెనింగ్‌‌ ఈవెంట్‌‌కు శివకార్తికేయన్‌‌తో పాటు కయాదు లోహర్ కూడా హాజరైంది.  విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రంలో హీరోహీరోయిన్స్‌‌ స్టూడెంట్ లీడర్స్‌‌గా కనిపిస్తారని తెలుస్తోంది.ముఖ్యంగా కయాదు పాత్రలో వచ్చే ట్విస్టులు సర్‌‌‌‌ప్రైజ్ చేస్తాయని సమాచారం.  అక్టోబర్‌‌‌‌ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌ మొదలవబోతోంది. ఇదికాక తమిళంలో సూర్యతో ఓ సినిమా, మారి సెల్వరాజ్‌‌ డైరెక్షన్‌‌లో మరో సినిమా చేస్తోంది కయాదు.