న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడ్డాడు. అతని కుడి కాలి పిక్కకు తీవ్ర గాయం కావడంతో కనీసం మూడు వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. దాంతో త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే వైట్ బాల్ మ్యాచ్‌లకు పాండ్యా అందుబాటులో ఉండటం లేదు.
ఈ నెల 20 వరకు ఫిట్‌నెస్ సాధిస్తాడని భావించిన సెలెక్టర్లు అక్టోబర్ 6 నుంచి ఆస్ట్రేలియా–ఎతో మొదలయ్యే వన్డే సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేశారు. కానీ తాజాగా నిర్వహించిన స్కానింగ్ రిపోర్టుల్లో పిక్కకు గాయమైందని తేలింది.
దాంతో బీసీసీఐ మెడికల్ ప్యానెల్ డాక్టర్ దిన్షా పరిడివాలా పాండ్యా నివేదికలను పరిశీలించి విశ్రాంతి సూచించారు. అంతకుముందు అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ముందు డ్రిల్స్ చేస్తుండగా హార్దిక్ మోకాలిలో నొప్పి తలెత్తింది. దాంతో ఆ సిరీస్‌కు దూరమయ్యాడు. ఓవరాల్‌గా గత నాలుగు నెలల వ్యవధిలో హార్దిక్ గాయాల బారిన పడటం ఇది మూడోసారి.
