కొత్త టాలెంట్‌‌ ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్తుంది 

కొత్త టాలెంట్‌‌ ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్తుంది 

సందీప్ కిషన్ హీరోగా, జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్-  అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్‌‌టైనర్  ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌‌.  లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగులో మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ప్రీ  రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా.  

జేసన్ సంజయ్‌‌ను చూస్తుంటే విజయ్‌‌ను చూసినట్టుగా అనిపిస్తుంది. తన తాత, తండ్రి నుంచి వచ్చిన ప్యాషన్‌‌తో దర్శకత్వంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా.  కొత్త టాలెంట్‌‌ను ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతిస్తుంది’ అని చెప్పారు. తన జనరేషన్‌‌కు మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి అని, తన సినిమా ఈవెంట్‌‌కు ఆయన రావడం ఎంతో ఆనందంగా ఉందని సందీప్ కిషన్ అన్నాడు. 

ఈ మూవీ తనకు చాలా స్పెషల్ అని ఫరియా చెప్పింది.  ఈ చిత్రంలో  హీస్ట్, ట్రెజర్ హంట్ వంటి అంశాలు కొత్తగా  ఉంటాయని డైరెక్టర్ జేసన్ సంజయ్ అన్నాడు. కార్యక్రమంలో పాల్గొన్న   మైత్రీ నిర్మాత నవీన్ యెర్నేని, ఎస్‌‌కేఎన్, సాయి రాజేష్​ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరారు. టీమ్ అంతా పాల్గొన్నారు.