హైదరాబాద్, వెలుగు: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎర్లీ డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకు ఆఫర్లతో కలిపి వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఫోన్‌ను రూ.18,500కు దక్కించుకోవచ్చు. ఐకూ జెడ్10 లైట్ 5జీ ఫోన్ ధర రూ.16 వేలకు, ఐకూ నియో 10 ఫోన్ రేటు రూ.42 వేలకు తగ్గింది.
లావా బోల్డ్ ఎన్2 ఫోన్ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.8,729కే అందుబాటులో ఉంది. శామ్సంగ్ 653 లీటర్ల ఏఐ స్మార్ట్ రెఫ్రిజిరేటర్ రూ.83 వేలకు, బోష్ ఎనిమిది కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ను రూ.32 వేలకు దక్కించుకోవచ్చని అమెజాన్ తెలిపింది.
ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా పది శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. ప్రైమ్ మెంబర్లకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
