టెక్నాలజీలపై అవగాహనకు సదస్సు  

టెక్నాలజీలపై అవగాహనకు సదస్సు  

హైదరాబాద్​, వెలుగు: ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు పెరుగుతున్న సైబర్ ముప్పులపై అవగాహన కలిగించడానికి ఐసాకా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం ఫ్యూజన్ పేరుతో వార్షిక సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సైబరాబాద్ ​కమిషనర్‌‌ ​రమేశ్ ​మాట్లాడుతూ.. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని  తెలిపారు.  

డీప్‌‌‌‌ ఫేక్ వీడియోలు, డిజిటల్ సర్వైలెన్స్, ఓటీపీ ఆధారిత లావాదేవీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో పాటు ఆడిట్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఆర్థిక నేరాలను సమర్థంగా అడ్డుకోవచ్చని తెలిపారు. 

ఈ సందర్భంగా డేటా రక్షణ, సైబర్ రిస్క్, డిజిటల్ మోసాల నివారణకు సంస్థలు, నిపుణులు ఏ విధంగా సమన్వయంతో పనిచేయాలనే అంశాలపై చర్చించారు.