బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన పుష్ప

బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన పుష్ప

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సంద్భంగా రిలీజ్ అయిన పుష్ప టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. గురువారం విడుదలైన ఈ టీజర్ కు ఇప్పటికే 32 మిలియన్ల వ్యూస్ దక్కాయి. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ పేరిట ఉన్న రికార్డులను పుష్ప బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో నంబర్ వన్ గా ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా బన్నీ చెప్పిన తగ్గేదే లే అనే డైలాగ్ కి మంచి అప్లాస్ వస్తోంది. టీజర్ తో ఇన్ని రికార్డులు కొడుతున్న ఐకాన్ స్టార్.. సినిమా విడుదలయ్యాక ఇంకెంత సంచలనం సృష్టిస్తాడో చూడాల్సిందే.