వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 20 రన్స్ లోపే 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు, విజయ్ శంకర్ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలోనే రాయుడు హాఫ్ సంచరీ చేశాడు. దూకుడుగా ఆడిన శంకర్(45) 31.05 ఓవర్ లో రన్ ఔట్ అయ్యాడు. 37 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 139. రాయుడు(55), కేదార్ జాదవ్(10) క్రీజులో ఉన్నారు.
కివీస్ బౌలర్లలో..హెన్రీ, బోల్ట్ చెరో రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్.
FIFTY!@RayuduAmbati brings up his 10th ODI half-century
India 129/5 after 35 #NZvIND pic.twitter.com/8ZC5RsG2rm
— BCCI (@BCCI) February 3, 2019
