ప్రధాని మోడీ దేశ ప్రజలందరినీ బంగారం ఏడాది పాటు కొనొద్దంటూ రిక్వెస్ట్ చేసిన తర్వాత చాలా మంది చూపు వెండిపై పడింది. గోల్డ్ కొనొద్దనటంతో రిస్క్ ఎందుకని చాలా మంది వెండి కొనుక్కోటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో వెండి కొనుగోళ్లపై ఎలాంటి పరిమితులు ఉన్నాయ్, ఎలాంటి ఆంక్షలు చట్ట ప్రకారం కొనసాగుతున్నాయ్ అనే విషయాలు తెలుసుకోవాలని గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో భారత ప్రభుత్వం ఒక కీలక ప్రకటనను కూడా విడుదల చేసింది. మోడీ పిలుపు తర్వాత బంగారం, వెండి దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ అదే దిగుమతి సుంకాలను పెంచే ఆలోచన లేదంటూ క్లారిటీ వచ్చింది. అర్జెంట్ కాని విదేశీ ప్రయాణాలు, గోల్డ్ కొనుగోళ్లు కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవటం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని మోడీ సర్కార్ చెబుతోంది. అయితే ప్రధాని మాటలతో స్టాక్ మార్కెట్లలో బంగారం రంగానికి చెందిన లిస్టెడ్ స్టాక్స్ 10 శాతం మేర కుప్పకూలాయి.
వెండిపై పరిమితులు ఇలా..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకారం దేశంలోని ప్రజలు తమ వద్ద ఎంత వెండిని ఉంచుకోవచ్చు అనే దానిపై ఎలాంటి పరిమితులు ఇప్పటి వరకూ లేవు. దీంతో ప్రజలు ఆభరణాల రూపంలో, కాయిన్స్ రూపంలో, కడ్డీల రూపంలో అలాగే ఇంట్లో వాడుకునే పాత్రల రూపంలో ఎంతైనా వెండిని హోల్డ్ చేయెుచ్చు. ఎక్కువగా వెండిని కలిగి ఉండటం వల్ల పన్ను ఇబ్బందులు ఏమీ ఉండవు అయితే ప్రజలు మాత్రం తమ వద్ద ఉన్న వెండికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఎలా కొన్నారనే వివరాలను మాత్రం మెయింటెన్ చేయటం మంచిది.
పన్ను చట్టాల ప్రకారం వెండిని క్యాపిటల్ అసెట్ కేటగిరీ కిందికి వస్తుంది. అందువల్ల 36 నెలల కంటే ఎక్కువ కాలం దానిని కలిగి ఉండటం వల్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వర్తిస్తుంది. అంటే వెండిని అమ్మినప్పుడు ఈ రేటు కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వానికి చట్ట ప్రకారం. సో వ్యక్తులు ఎంతైనా వెండిని తమ వద్ద ఉంచుకోవచ్చు ఎలాంటి పన్ను ఇబ్బందులు లేకుండా అయితే వాటిని ఎలా పొందారు లేదా ఎలా కొన్నారనే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రం తప్పకుండా కలిగి ఉండాలి. దీంతో చాలా మంది బంగారానికి బదులుగా ప్రస్తుతం వెండి కొనుక్కోవటం బెటర్ అని అనుకుంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు కూడా కావాల్సినంత కొనేసుకుందాం లిమిట్స్ లేవుగా అని ప్లాన్ చేసుకుంటున్నారు మోడీ ప్రకటన తర్వాత.
