V6 News

బెంగాల్‌లో కాంగ్రెస్‌ ఒక్కసీటు కూడా గెల్వదు: అమిత్ షా

బెంగాల్‌లో కాంగ్రెస్‌ ఒక్కసీటు కూడా గెల్వదు: అమిత్ షా
  • ఆ పార్టీతో కలిసి మమత నష్టపోవడం ఖాయం: అమిత్‌షా

కోల్‌కతా: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదని కేంద్ర హోం మంత్రి అమిత్​షా అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా మమతా బెనర్జీ రాజకీయంగా నష్టపోతారని విమర్శించారు. బుధవారం బెంగాల్‌లోని డమ్‌డమ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్​షా మాట్లాడారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్‌ డబుల్‌ డిజిట్‌ దాటదని అన్నారు. అస్సాంలోనూ కాంగ్రెస్‌కు అతిపెద్ద ఓటమి ఎదురవుతుందన్నారు. ఓటమిపాలయ్యే కాంగ్రెస్‌తో మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం రాజకీయ తప్పిదని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ‘‘మమతా దీదీ.. మీరు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం కారణంగా మీ పరిస్థితి మరింత దిగజారుతుంది”అని కామెంట్‌ చేశారు.