దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్న అమితాబ్

దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్న అమితాబ్

బాలీవుడ్  బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.  రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. అవార్డు ప్రదానోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొన్ని రోజుల క్రితమే అమితాబ్ అవార్డు అందుకోవాల్సి ఉన్నా…. అనారోగ్య కారణంగా ఆయన తీసుకోలేకపోయారు.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు అమితాబ్. ఫాల్కే అవార్డును ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు కాగా.. తాను ఇండస్ట్రీలోకి వచ్చి కూడా 50 ఏండ్లే అయిందన్నారు. అభిమానుల వల్లే తాను ఇంత స్థాయికి ఎదిగానని చెప్పారు అమితాబ్.