వార్ మొదలయ్యాక ఫస్ట్ టైం హార్మూజ్ను క్రాస్ చేసిన అమెరికా నౌకలు !

వార్ మొదలయ్యాక ఫస్ట్ టైం హార్మూజ్ను క్రాస్ చేసిన అమెరికా నౌకలు !

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలయ్యాక తొలిసారి అమెరికా నౌకలు హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించాయని సమాచారం. ముగ్గురు అమెరికా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు అమెరికా నేవీ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు శనివారం హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. ఆరు వారాల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలమార్గం మీదుగా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించడం ఇదే మొదటిసారి అని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ రిపోర్ట్ చేసింది.

ఎలాంటి ఇబ్బంది లేకుండా నౌకలు హార్మూజ్ మీదుగా ప్రయాణించాయని.. ఈ చర్యను నౌకాయాన స్వేచ్ఛ మిషన్‌గా అమెరికా అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ట్యాంకర్లు వాణిజ్య నౌకలకు రక్షణగా వెళ్లడం లేదని అధికారులు స్పష్టం చేశారు. రెండు అమెరికా నావికాదళ క్షిపణి విధ్వంసక నౌకలు వ్యూహాత్మక హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించాయని అమెరికా చెప్పుకొస్తుంది గానీ ఇరాన్ ఇప్పటికీ నిర్ధారించలేదు.

యుద్ధానికి ముగింపు పలకడంపై చర్చించేందుకు అమెరికా, ఇరాన్ సంప్రదింపుల బృందాలు పాకిస్థాన్‌లో సమావేశమైన క్రమంలో అమెరికా యుద్ధ నౌకలు హార్మూజ్ మీదుగా ప్రయాణించడం సానుకూల పరిణామంగా అంతర్జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. కాల్పుల విరమణలో భాగంగా హార్మూజ్ జలసంధిని తెరవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే.

Also Read : డీజిల్పై ఎగుమతి సుంకం లీటర్పై 55 రూపాయలకు పెంచిన కేంద్రం

ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ, మరోవైపు లెబనాన్‎లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బలగాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. లెబనాన్‎పై దాడులను తగ్గించాలంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చినప్పటికీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. శనివారం కూడా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్‌‌పై వైమానిక దాడులు జరిపాయి.