Jassman Sandlas: ‘ధురంధర్’ లేడీ సింగర్పై ఫ్యాన్స్ అసభ్య ప్రవర్తన? లైవ్ కాన్సర్ట్‌ వీడియో వైరల్

Jassman Sandlas: ‘ధురంధర్’ లేడీ సింగర్పై ఫ్యాన్స్ అసభ్య ప్రవర్తన? లైవ్ కాన్సర్ట్‌ వీడియో వైరల్

‘ధురంధర్’లోని  ‘జైయే సజన’ పాటతో కుర్రకారును ఊపేసిన ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ జాస్మిన్ (Jassman Sandlas) గుర్తిందిగా. ఈ  పాప్ సింగర్ చేస్తున్న లైవ్ కాన్సర్ట్‌లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే డెహ్రాడూన్‌లో జరిగిన మ్యూజిక్ ఈవెంట్‌లో జాస్మిన్ స్టేజీపై పర్ఫార్మ్ చేస్తుండగా, కొంతమంది ఆకతాయిలు ఆమె పట్ల తీవ్ర అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. స్టేజీపై జాస్మిన్ మైక్‌లో మాట్లాడుతుండగానే, కింద ఉన్న ఆకతాయిలు ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని కిందకు లాగేందుకు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. ఇదే కార్యక్రమంలో జాస్మిన్ సాండ్లాస్, తన కాబోయే భర్త శేఖర్ చౌదరితో నిశ్చితార్థాన్ని అభిమానుల సమక్షంలో ప్రకటించారు. అయితే, ఆ హ్యాపీ మూమెంట్స్ ముగిసిన కొద్దిసేపటికే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. 

వైరల్ వీడియోలో ఏముంది?

డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ సంగీత కచేరీకి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. జాస్మిన్ తన హిట్ పాటలు 'సిప్ సిప్', 'శరారత్', 'లావన్' వంటి పాటలతో ప్రేక్షకులను అలరించారు. ప్రదర్శన ముగిసిన తర్వాత జాస్మిన్ స్టేజ్‌కు సమీపంలో ఉన్న అభిమానులను పలకరిస్తూ, వారు ఇచ్చిన గులాబీ పూలను స్వీకరిస్తూ ముందుకు వెళ్లారు.

ఈ సమయంలో అభిమానులు ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, ఆ గందరగోళంలో కొందరు వ్యక్తులు జాస్మిన్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏ క్రమంలోనే అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారినట్లు పలు కథనాలు చెబుతున్నాయి.

సోషల్ మీడియాలో విమర్శలు..

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాకారులు అభిమానులను కలవడానికి ముందుకు వచ్చినంత మాత్రాన వారి వ్యక్తిగత హద్దులను దాటకూడదని, మహిళా కళాకారులతో గౌరవంగా ప్రవర్తించాలని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ‘మహిళా సింగర్లకు అస్సలు రక్షణ లేకుండా పోతోంది.. లైవ్ ఈవెంట్స్ నిర్వాహకులు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందే!’ అని కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

నిశ్చితార్థం ప్రకటన తర్వాత వివాదం..

ఇదే కార్యక్రమంలో జాస్మిన్ సాండ్లాస్ తన కాబోయే భర్త శేఖర్ చౌదరిని వేదికపైకి ఆహ్వానించి, తమ నిశ్చితార్థాన్ని అభిమానుల సమక్షంలో ప్రకటించారు. ఆమె తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను కూడా చూపించగా ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందించారు.

అయితే, ఆ హ్యాపీ మూమెంట్స్ తర్వాత జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఘటనపై జాస్మిన్ సాండ్లాస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఆరోపణలపై కూడా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.