డీజిల్పై ఎగుమతి సుంకాన్ని లీటర్పై 21.5 రూపాయల నుంచి 55.5 రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో వినియోగించే ఇంధనమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై కూడా లీటర్పై ఎగుమతి సుంకం రూ.29.5 నుంచి 42 రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పెట్రోల్పై ఎగుమతి సుంకం విధించకపోవడం గమనార్హం. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై సుంకాలు వేయడం వల్ల దేశీయ వినియోగానికి సరిపడా ఇంధనం అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
The duty on export of diesel has been increased from Rs 21.5 per litre to Rs 55.5 per litre. Duty on ATF (Aviation Turbine Fuel) has been increased from Rs 29.5 per litre to Rs 42 per litre. Export duty on petrol continues to remain Nil: Finance Ministry pic.twitter.com/75qNV3mCJa
— ANI (@ANI) April 11, 2026
ఎగుమతి సుంకం పెంపు లక్ష్యం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టడం కాదని.. ధరల్లో వ్యత్యాసం కారణంగా ఎగుమతిదారులు అదనపు ప్రయోజనం పొందే అవకాశం లేకుండా దేశంలో డీజిల్ లభ్యతకు ఇబ్బంది కలగకుండా ఉంచడమే ఈ పెంపు ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దేశీయంగా ఇంధన సప్లైకి ఇబ్బంది కలగకుండా డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ఎగుమతులపై ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తున్న సంగతి తెలిసింది.
Also Read : 'మా దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ స్వీట్ ఆయిల్ ఉంది
ఇప్పుడు పెంచిన ఎగుమతి సుంకం కూడా ఇందులో భాగమే కావడం గమనార్హం. రిఫైనరీలు అదనపు లాభాల కోసం విదేశాలకు ఇంధనాన్ని తరలించకుండా ఆపటానికి డీజిల్ ఎగుమతిపై లీటరుకు 55.50, విమాన ఇంధనం ఏటీఎఫ్పై రూ.42 చొప్పున పన్ను విధించింది. ఈ సుంకాలపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష జరుగుతుంది.
