ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ మార్పు.. తారక్‌ను ఢీకొట్టే విలన్‌గా బాలీవుడ్ హీరో ఎంట్రీ?

ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ మార్పు.. తారక్‌ను ఢీకొట్టే విలన్‌గా బాలీవుడ్ హీరో ఎంట్రీ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న  ప్రతిష్టాత్మక చిత్రం 'డ్రాగన్' (NTRNeel) . ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో మాస్ యాక్షన్‌కు కొత్త అర్థం చెప్పిన నీల్, ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే, ఈ సినిమా కాస్టింగ్ విషయంలో లేటెస్ట్ గా ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

టోవినో థామస్ అవుట్..

ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్‌ను మొదట ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లాంటి పవర్‌హౌస్ పక్కన టోవినో లాంటి ప్రతిభావంతుడైన నటుడు ఉంటే బాగుంటుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం టోవినో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీనికి కారణం 'కాల్ షీట్స్' సమస్య అని తెలుస్తోంది. డ్రాగన్ సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉండటంతో, తన మలయాళ సినిమాల షెడ్యూల్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఇటీవల  తెలిపారు. 

రంగంలోకి షాహిద్ కపూర్?

టోవినో స్థానంలో ఒక పవర్‌ఫుల్ నటుడిని వెతికే పనిలో ఉన్న మేకర్స్, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు టాక్. 'కబీర్ సింగ్' వంటి సినిమాలతో  మెప్పించిన షాహిద్, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఢీకొనే విలన్ పాత్రకు సరిగ్గా సరిపోతారని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, వెండితెరపై ఎన్టీఆర్ - షాహిద్ కపూర్ల పోరు ప్రేక్షకులకు కనువిందుగా మారడం ఖాయం అంటున్నారు అభిమానులు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : 'పాపం' హరీష్ శంకర్.. ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించిన 'ఉస్తాద్' దర్శకుడు!

భారీ తారాగణం..

ఈ సినిమాలో ఇప్పటికే పలువురు స్టార్ నటులు భాగమయ్యారు. కన్నడ క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు.  ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి బీభత్సమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

షూటింగ్ అప్‌డేట్

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 14 నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లోనే షాహిద్ కపూర్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ మార్క్ యాక్టింగ్, నీల్ మార్క్ మేకింగ్ కలిస్తే 'డ్రాగన్' సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి మరి.