ఢిల్లీ, ఉత్తరాఖండ్లో భూ ప్రకంపనలు

ఢిల్లీ, ఉత్తరాఖండ్లో భూ ప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక పలు చోట్ల 20 సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టరు స్కేలుపై తీవ్రత 1.6  నమోదైంది. ఢిల్లీతో పాటు ఘజియాబాద్, గ్రేటర్ నోయిడాల్లోనూ పలు చోట్ల భూమి కంపించింది. అర్థరాత్రి తర్వాత 1.57గంటలకు ఎన్సీఆర్ పరిధిలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

ఉత్తరాఖండ్‌లోనూ భూకంపం వచ్చింది. ఉదయం 6.27గంటలకు పిత్తోర్ ఘడ్ లో 4.3 తీవ్రతతో భూమి కంపించింది. భూమికి 5కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది.