పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జైలు నుంచి పోటీచేసి గెలిచిన అనంత్ సింగ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంత్ మంగళవారం జైలు నుంచి అసెంబ్లీకి చేరుకోగా.. స్పీకర్ ప్రేమ్ కుమార్ అతనితో ప్రమాణం చేయించారు. గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పాట్నా జిల్లా మోకామా నుంచి జేడీయూ నుంచి అనంత్ సింగ్ పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన జైలులో ఉన్నారు.
అయితే, ఎన్నికల్లో ఆయన ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28,206 ఓట్ల మెజారిటితో గెలుపొందారు. ప్రశాంత్‌కిషోర్ జన్ సురాజ్ పార్టీ సపోర్టర్ దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో ఎన్నికలకు ముందు 2025లో అనంత్సింగ్అరెస్ట్ అయ్యారు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉన్నారు. తాజాగా పాట్నా కోర్టు అనుమతితో మంగళవారం అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
