జూన్ 1న గోపిచంద్ పక్కా కమర్షియల్ పాట రిలీజ్

జూన్ 1న గోపిచంద్ పక్కా కమర్షియల్ పాట రిలీజ్

ప్రతిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ్లసర్ స‌క్సెస్ తర్వాత విల‌క్షణ ద‌ర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్.  మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్ననలు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చర్స్, - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్యమైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు కూడా గొప్ప క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా జూలై 1, 2022న పక్కా కమర్షియల్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.  

తాజాగా ఈ సినిమాలోని అందాల రాశీ పాటను జూన్ 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి.. అద్భుతంగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఈ సారి కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్,- యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. కాగా ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా...  జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

నటీనటులు: గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్యరాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు
టెక్నికల్ టీం: స‌మ‌ర్పణ - అల్లు అరవింద్
బ్యాన‌ర్ - జీఏ2పిక్చర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత‌ - బ‌న్నీ వాస్
ద‌ర్శకుడు - మారుతి
ప్రొడ‌క్షన్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్
మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్
స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్
లైన్ ప్రొడ్యూసర్ - బాబు
ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భవ్
సినిమాటోగ్రఫి - క‌ర‌మ్ చావ్ల
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్

 

మరిన్ని వార్తల కోసం...

కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో విజయ్ దేవరకొండ

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..