V6 News

తుంగభద్రకు కేటాయింపులు జరిగిపోయినయ్..వాటిని మార్చే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్కు లేదు: ఏపీ

తుంగభద్రకు కేటాయింపులు జరిగిపోయినయ్..వాటిని మార్చే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్కు లేదు: ఏపీ

హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర కింద బచావత్​ ట్రిబ్యునల్​ చేసిన కేటాయింపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీల్లేదని ఏపీ వాదించింది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్​కు స్పెసిఫిక్​  కేటాయింపులు జరిగిపోయాయని స్పష్టం చేసింది. గురువారం బ్రిజేశ్​ ట్రిబ్యునల్​లో ఏపీ తన వాదనలను కొనసాగించింది. బచావత్​ ట్రిబ్యునల్​ అవార్డులోని క్లాజ్​ 9 కింద తుంగభద్ర లెఫ్ట్​ కెనాల్​కు 29.5 టీఎంసీలు, హైలెవెల్​ కెనాల్​కు 32.5 టీఎంసీలు కేటాయించిందని బ్రిజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​ ముందు వాదించింది.

ఆ కోటాను మార్చే అధికారం బ్రిజేశ్​ ట్రిబ్యునల్​కు లేదని పేర్కొంది. లో లెవెల్​ కెనాల్​ కింద 1.58 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, కానీ తెలంగాణ ఆ ఆయకట్టును 1.5 లక్షల ఎకరాలకు కుదించిందని తెలిపింది. 8 వేల ఎకరాలు కోత పెట్టడం కరెక్ట్  కాదని పేర్కొంది. మరోవైపు క్రాప్ డేస్​ 152 రోజులని, అయితే.. 135 రోజులే తీసుకోవాలంటూ షరతు పెట్టడం కరెక్ట్​ కాదని వాదించింది.