యాపిల్‌‌‌‌ సీఈఓ జీతం తగ్గించారు

యాపిల్‌‌‌‌ సీఈఓ జీతం తగ్గించారు

సేల్స్‌‌‌‌ డౌనే కారణం

2019లో రూ.83 కోట్లే శాలరీ  2018లో రూ.112  కోట్లు ఉండేటిది

శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కో: ఐఫోన్ సేల్స్ పడిపోవడం యాపిల్ సీఈవో జీతానికి భారీగా గండికొట్టింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో టిమ్‌‌‌‌ కుక్‌‌‌‌ దాదాపు రూ.29 కోట్ల మేర జీతాన్ని పోగొట్టుకున్నారు. కంపెనీ ఫైనాన్షియల్ పర్‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్ తగ్గడంతో, టిమ్ కుక్‌‌‌‌ జీతం 2019లో11.6 మిలియన్ డాలర్లకు(రూ.83 కోట్లకు) చేరింది. 2018లో ఆయన జీతం 15.7 మిలియన్ డాలర్లుగా(రూ.112 కోట్లుగా) ఉండేది. దీనిలో 3 మిలియన్ డాలర్లు జీతం కాగా, మిగిలినదంతా బోనస్‌‌‌‌లు, పలు జీతభత్యాలున్నాయి. 2019లో బోనస్‌‌‌‌ల కింద టిమ్‌‌‌‌ కుక్ 7.7 మిలియన్ డాలర్లను పొందారు.యాపిల్​తన సేల్స్ టార్గెట్‌‌‌‌ను కేవలం 28 శాతమే చేరుకోవడంతో బోనస్‌‌‌‌లు తగ్గిపోయాయి. 2018లో అయితే 12 మిలియన్ డాలర్ల బోనస్‌‌‌‌లను ఆర్జించారు.  ఆ ఏడాది తాను పెట్టుకున్న సేల్స్ టార్గెట్‌‌‌‌నుయాపిల్​100 శాతం సాధించినట్టు సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌‌‌‌ చెప్పింది. 2019లో కుక్‌‌‌‌కు 8.85 లక్షల డాలర్ల జీతభత్యాలను కంపెనీ చెల్లించింది. దీనిలో ఆయన సెక్యూరిటీ, ప్రైవేట్ జెట్ వాడకం వంటివి ఉన్నాయి. సెక్యురిటీ కారణాలతో టిమ్ కుక్‌‌‌‌కు ప్రైవేట్ జెట్‌‌‌‌నే అందించాలని బోర్డు నిర్ణయించింది.ఆయన ఏ దేశానికి వెళ్లినా ప్రైవేటు జెట్​నే వాడుతున్నారు.

113 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు…

సంస్థ హెడ్‌‌‌‌గా కుక్‌‌‌‌కు జీతం, బోనస్‌‌‌‌లు కాకుండా.. 113 మిలియన్ డాలర్లకు పైగా విలువైనయాపిల్​కంపెనీ షేర్లు ఆయనకు ఉన్నాయి. ఐఫోన్ సేల్స్ పడిపోతుండటంతో,యాపిల్​ఇతర మార్గాల ద్వారా రెవెన్యూలు ఆర్జించాలని చూస్తోంది. దీనిలో భాగంగా డిజిటల్ కంటెంట్, సర్వీసులపై ఫోకస్ చేస్తోంది.యాపిల్​2019లో 260.2 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలను, 63.9 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణ ఆదాయాన్ని ఆర్జించినట్టు డాక్యుమెంట్స్ ఫైలింగ్‌‌‌‌లో వెల్లడించింది.